Bollywood: ఆమిర్​ ఖాన్​ కు కరోనా.. హోమ్ ఐసోలేషన్!

Aamir Khan tests Covid positive in home quarantine
  • ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటన
  • తనను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని సూచన
  • కో-స్టార్ కియారా అద్వానీకి నెగెటివ్ 
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. కరోనా నిబంధనలను అనుసరించి ఇంట్లో ఐసోలేట్ అయినట్టు ఆయన ప్రకటించారు. ఈ మధ్య కాలంలో తనను కలిసినవారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆమిర్ ఖాన్ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘ఆమిర్ ఖాన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లో ఆయన ఐసోలేట్ అయ్యారు. కరోనా నిబంధనలను పాటిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది’’ అని ప్రకటించారు. ఆమిర్ ఖాన్ తో కియారా అద్వానీ ఓ ప్రకటన కోసం ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆమెకు టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు చెప్పాయి.

అయితే, ఆమిర్ ఖాన్ కన్నా ముందే ఆమెకు టెస్ట్ చేశారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా, కియారా హీరోయిన్ గా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ప్రస్తుతం భూల్ భులయ్యా 2 సినిమా తెరకెక్కుతోంది. కార్తీక్ కు కరోనా పాజిటివ్ రావడంతో అనీస్, కియారాలు టెస్ట్ చేయించుకున్నారు. కాగా, అంతకుముందు రణ్ బీర్ కపూర్, మనోజ్ బాజ్ పేయి, సిద్ధాంత్ చతుర్వేది, తారా సుతారియా, సతీశ్ కౌశిక్ లకూ కరోనా పాజిటివ్ వచ్చింది.

కాగా, ఆమిర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ ఛద్ధా అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హాలీవుడ్ లో టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ లాల్ సింగ్ ఛద్ధా. ఈ ఏడాది క్రిస్మస్ నాటికి సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Bollywood
Aamir Khan
COVID19

More Telugu News