మహేశ్ బాబుకి తండ్రిగా మలయాళ నటుడు!
- తెలుగులో కీలక పాత్రలు పోషిస్తున్న జయరామ్
- 'రాధే శ్యామ్', 'హరిహర వీరమల్లు'లో ముఖ్య పాత్రలు
- 'సర్కారు వారి పాట'లో బ్యాంక్ మేనేజర్ పాత్ర
ఈ క్రమంలో ఇప్పుడు మహేశ్ బాబు సినిమాలో ఓ కీలక పాత్రకు జయరామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో జయరామ్ నటిస్తున్నారు. మహేశ్ బాబుకి తండ్రిగా, బ్యాంక్ మేనేజర్ పాత్రలో ఆయన కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తయ్యాక జయరామ్.. మహేశ్ సినిమాలో జాయిన్ అవుతాడట.
ఇటీవలి కాలంలో మన బ్యాంకింగ్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుంది. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.