Sonakshi Sinha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Sonakshi Sinha to be cast opposite Balakrishna
షార్ట్స్‌లో చూడండి
*  బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా త్వరలో రెండు భారీ తెలుగు సినిమాలలో నటించే అవకాశం వుంది. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందే సినిమాలో కథానాయిక పాత్రకోసం సోనాక్షిని సంప్రదిస్తున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. తాజాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందే సినిమా కోసం కూడా ఆమెను సంప్రదిస్తున్నారట. ఈ రెండు ప్రాజక్టులకు ఆమె ఓకే చెబుతున్నట్టు తెలుస్తోంది.
*  పవన్ కల్యాణ్ చాలా గ్యాప్ తర్వాత నటించిన 'వకీల్ సాబ్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో నిన్నటి నుంచి పవన్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తారు.
*  ప్రముఖ తమిళ చిత్ర కథానాయకుడు సూర్య తెలుగులో కూడా సొంత చిత్ర నిర్మాణాన్ని జరపాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే ఆయన 2D ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తమిళంలో సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇదే బ్యానర్ పై తెలుగులో కూడా సినిమాలు నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఆ దిశగా ప్లానింగ్ చేస్తున్నాడట.
Go Back to Shorts
Sonakshi Sinha
Balakrishna
Pawan Kalyan
Surya

More Telugu News