Suvendu Adhikari: మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే: సువేందు అధికారి

Speaking against PM Modi is like speaking against democracy
  • మమతా బెనర్జీ విమర్శలకు సువేందు స్పందన
  • మోదీ వ్యతిరేక ఆలోచన భరతమాతకు వ్యతిరేకమే
  • అందరూ మోదీ వ్యాక్సిన్ తీసుకోవాలి
తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న పశ్చిమ బెంగాల్ నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా గళమెత్తినట్టేనని అన్నారు.

ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించడం అంటే భరతమాతకు వ్యతిరేకంగా ఆలోచించడమేనని పేర్కొన్నారు. మోదీ ప్రజలు ఎన్నుకున్న ప్రధాని అని అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు కరోనా టీకాలు లేవని, కాబట్టి  మీరందరూ ప్రధాని నరేంద్రమోదీ టీకాను తీసుకోవాలని సూచించారు.

ఎగ్రా, పటాస్‌పూర్‌లలో జరిగిన బహిరంగ సభల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సిన్ సహా పలు అంశాల్లో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సువేందు అధికారి ఇలా స్పందించారు.
Suvendu Adhikari
Mamata Banerjee
West Bengal
Narendra Modi

More Telugu News