స్లో ఓవర్ రేట్.. ఇంగ్లండ్ జట్టుకు జరిమానా

ICC Fined England Team For Slow Over Rate
షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్ జట్టు నెమ్మదిగా బౌలింగ్ చేసింది. నిర్దేశిత సమయంలో ఓవర్లు వేయనందుకు గాను ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఇంగ్లండ్ జట్టుకు జరిమానా విధించారు.

ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్లో ఓవర్ రేటును అంగీకరించడంతో ఎలాంటి విచారణ అవసరం పడలేదు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Go Back to Shorts
England
India
T20
ICC
Fine

More Telugu News