Atchannaidu: మీరు జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని డిల్లీ టాక్: విజయసాయిరెడ్డిపై అచ్చెన్న ఫైర్

Atchannaidus counter to Vijayasai Reddys comments on Chandrababu
  • మీ వెనుకున్న మురికిని చూసుకోండి
  • మీ దొంగ లెక్కల కేసును తేల్చమని మోదీని ఎందుకు అడగడం లేదు?
  • శుక్రవారం విచారణను ఎగ్గొట్టే జగ్గడు, నువ్వూ ఇంకొకరి గురించి చెప్పటమా? 
'అవినీతికి పాల్పడి నానా అడ్డదారులు తొక్కే బదులు ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు చంద్రం' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమరావతి భూముల వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయిపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

'ట్విట్టర్ లో పిచ్చి కూతలు కూసే బదులు మీ వెనుకున్న మురికిని చూసుకోండి సాయిరెడ్డీ' అని దుయ్యబట్టారు. 10 ఏళ్ల నుంచి మీ దొంగ లెక్కల కేసును తేల్చమని మోదీని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి మూతి నొప్పని, ముడ్డి నొప్పని శుక్రవారం విచారణను ఎగ్గొట్టే జగ్గడు, నువ్వూ ఇంకొకరి గురించి చెప్పటమా? అని మండిపడ్డారు. ముందు మీ కేసుల విచారణ గురించి ఆలోచించుకోవాలని అన్నారు. మీరు జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని ఢిల్లీ టాక్ అని చెప్పారు.
Atchannaidu
Telugudesam
Vijayasai Reddy
Jagan
YSRCP

More Telugu News