సెలవుపై వెళ్లాలని నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరికాదు: సజ్జల ఫైర్
- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 6 రోజుల్లో పూర్తవుతాయి
- కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్నికలను వెంటనే నిర్వహించాలి
- నిమ్మగడ్డ సెలవును వాయిదా వేసుకోవాలి
రిజర్వేషన్ల విషయంలో జగన్ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని సజ్జల చెప్పారు. 78 శాతం మంది బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు చెందినవారిని మేయర్, ఛైర్మన్ స్థానాల్లో నియమించారని తెలిపారు. చట్టంలో లేకపోయినా వీరికి అదనంగా రిజర్వేషన్లను కల్పించామని చెప్పారు. బీసీలకు 46.51 శాతం, మైనార్టీలకు 13.95 శాతం పదవులు ఇచ్చామని తెలిపారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగానే పదవుల కేటాయింపులు జరిగాయని చెప్పారు.