Maharashtra: మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా

Corona virus effect on Maharashtra
  • దేశ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • 65 శాతం కేసులు మహారాష్ట్రలో నమోదు
  • 24 గంటల్లో మహారాష్ట్రలో 172 మంది మృతి
ఎన్నో కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్న తర్వాత మన దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి... ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. రోజురోజుకూ దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. మరాఠా గడ్డపై మహమ్మారి పంజా విసిరింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు  65 శాతం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 35,871 కేసులు నమోదు కాగా... ఇందులో 23,179 కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 172 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోనే 84 మంది మృతి చెందారు. 85 శాతం కేసులు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి.
Maharashtra
Corona Virus

More Telugu News