Kruti Sanon: పూజహెగ్డే పాత్రలో కృతి సనన్!

Kruti Sanon to play lead role in Telugu remake
  • హిందీలోకి 'అల వైకుంఠ పురములో'
  • రోహిత్ ధావన్ దర్శకత్వంలో రీమేక్
  • అల్లు అర్జున్ పాత్రలో కార్తీక్ ఆర్యన్  
ఇటీవలి కాలంలో తెలుగులో వచ్చిన హిట్ చిత్రాలను హిందీలో రీమేక్ చేయడం ఎక్కువైంది. భారీ రేట్లతో రీమేక్ హక్కులను దక్కించుకుంటున్నారు. అదే కోవలో ఇప్పుడు 'అల వైకుంఠ పురములో' సినిమా కూడా రీమేక్ అవుతోంది. అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇందులోని పాటలైతే అన్నీ కూడా సూపర్ హిట్టయ్యాయి. ఆయా పాటలు యూ ట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకున్నాయి.

ఈ నేపథ్యంలో రీమేక్ అవుతున్న ఈ చిత్రంపై అప్పుడే ఎంతో క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా అల్లు అర్జున్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక బుట్టబొమ్మ పూజ హెగ్డే పాత్రకు తాజాగా కృతి సనన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని భావిస్తున్నారు. ఇదిలావుంచితే, ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ఆదిపురుష్' హిందీ సినిమాలో కథానాయికగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే!
Kruti Sanon
Pooja Hegde
Allu Arjun
Trivikram Srinivas

More Telugu News