Tirupati LS Bypolls: జ‌గ‌న్ ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన డాక్టర్ గురుమూర్తి

Tirupati YSRCP candidate Gurumurthy meets Jagan
  • ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక
  • డాక్టర్ గురుమూర్తిని తమ అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ
  • బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలకు డాక్టర్ గురుమూర్తిని తమ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ను గురుమూర్తి కలిశారు. తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ కు పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గురుమూర్తికి జగన్ 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. మార్చి 23న నోటిఫికేషన్‌ విడుదల, ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News