Students: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని ఓ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా

Three students tested corona positive in a school in Secunderabad
  • తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
  • ఓ ప్రభుత్వ బాలుర పాఠశాలలో కరోనా కలకలం
  • 84 మందికి రాపిడ్ యాంటీజెన్ కరోనా పరీక్షలు
  • కరోనా పాజిటివ్ విద్యార్థులను స్వస్థలాలకు తరలింపు
తెలంగాణలో కరోనా క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. ఇటీవల తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉద్ధృతమవుతోంది. తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని ఓ ప్రభుత్వ బాలుర పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన రాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

కంటోన్మెంట్ ఏరియాలో స్కూళ్లు పునఃప్రారంభమైన తర్వాత విద్యార్థులు కరోనా బారినపడడం ఇదే తొలిసారి. కొందరు బాలురు అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఈ పాఠశాలలో 84 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు కరోనాతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారిని వారి స్వస్థలాలకు పంపించారు.
Students
Corona Virus
Positive
School
Secunderabad

More Telugu News