Jeevan Reddy: ఎంపీ అర‌వింద్‌తో బండి సంజ‌య్ రాజీనామా చేయించాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి‌

  • పసుపు బోర్డు తీసుకువస్తానని అర‌వింద్ బాండ్ పత్రం రాశారు
  • ఒక‌వేళ దాన్ని తీసుకురాలేకపోతే రాజీనామా చేస్తానన్నారు
  • బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్రం చెప్పింది
jeevan reddy slams mp arvind

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో, దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అరవింద్ గ‌తంలో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పత్రం రాశారని, ఒక‌వేళ దాన్ని తీసుకురాలేకపోతే రాజీనామా చేస్తానని చెప్పార‌ని గుర్తు చేశారు.  

పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం నిన్న‌ స్పష్టం చేసిన నేప‌థ్యంలో అర‌వింద్ రాజీనామా చేయాలని జీవ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు. ‌ అరవింద్ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి రైతు ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు.

ఎంపీగా గెలిచి రెండేళ్లు గడిచినప్ప‌టికీ పసుపు బోర్డును ఎందుకు తీసుకురాలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప‌సుపుబోర్డుపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ఇప్పుడు అరవింద్ ఏం చేస్తారని ఆయ‌న నిల‌దీశారు.

అరవింద్‎తో బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్ రాజీనామా చేయించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. బీజేపీ దేశంలో ప్రతి రోజు ఒక్కో సంస్థని అమ్ముతోందని మండిప‌డ్డారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పారు.

More Telugu News