కరోనా ఎఫెక్ట్... మూతబడిన 71 లక్షల పీఎఫ్ ఖాతాలు
- 2020లో మూసివేతలో 6.5% పెరుగుదల
- నగదు ఉపసంహరణలూ ఎక్కువే
- రూ.73,498 కోట్లు విత్ డ్రా
- అంతకుముందు ఏడాది కన్నా 33% ఎక్కువ
పీఎఫ్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ కూడా గత ఏడాది భారీగా పెరిగింది. దాదాపు 2019తో పోలిస్తే 2020లో 33 శాతం ఎక్కువ లావాదేవీలు జరిగాయి. మొత్తంగా పోయినేడాది 73,498 కోట్ల రూపాయలను పీఎఫ్ ఖాతాదారులు డబ్బు ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఏడాది అది కేవలం రూ.55,215 కోట్లే కావడం గమనార్హం.
కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం, నిరుద్యోగిత రేటు పెరగడం వంటి కారణాలతో ఈపీఎఫ్ నుంచి పాక్షిక ఉపసంహరణలూ పెరిగాయి. 2019తో పోలిస్తే 2020లో రెట్టింపయ్యాయి. గత ఏడాది 1.3 కోట్ల పాక్షిక ఉపసంహరణలు జరిగితే.. అంతకుముందు ఏడాది అది కేవలం 54.4 లక్షలుగా ఉంది. కరోనా సంక్షోభ సమయంలో ఖాతాదారులు డబ్బు డ్రా చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ సైట్ లో ఓ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 75 శాతం నగదును డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది.
2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు నెలవారీగా మూతపడిన ఖాతాలు
- ఏప్రిల్ 2,30,593
- మే 4,62,635
- జూన్ 6,22,856
- జూలై 8,45,755
- ఆగస్ట్ 7,77,410
- సెప్టెంబర్ 11,18,517
- అక్టోబర్ 11,18,751
- నవంబర్ 9,54,158
- డిసెంబర్ 9,71,254
- మొత్తం 71,01,929
2020లో పాక్షిక ఉపసంహరణలు
- ఏప్రిల్ 13,43,278
- మే 10,52,098
- జూన్ 12,96,415
- జూలై 15,57,853
- ఆగస్ట్ 11,81,265
- సెప్టెంబర్ 16,66,191
- అక్టోబర్ 16,58,037
- నవంబర్ 14,42,020
- డిసెంబర్ 15,74,963
- మొత్తం 1,27,72,120