Allu Arjun: అల్లు అర్జున్ స‌రికొత్త లుక్‌.. ఫొటోలు వైర‌ల్!

allu arjun pics go viral
షార్ట్స్‌లో చూడండి
స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కు సంబంధించిన ప‌లు ఫొటోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. కొత్త సినిమా 'చావు కబురు చల్లగా' ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత శరత్‌ చంద్ర నాయుడు బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ త‌న తండ్రి అల్లు అరవింద్‌, సోద‌రుడు అల్లు శిరీష్‌తో క‌లిసి హాజ‌ర‌య్యాడు. శ‌ర‌త్ చంద్ర‌తో కేక్‌ కట్‌ చేయించి, ఆయ‌న‌కు తినిపించాడు.

అల్లు అర్జున్ క‌ళ్ల‌జోడు పెట్టి, గెడ్డం పెంచి కొత్త లుక్‌లో క‌న‌ప‌డుతుండ‌డం అభిమానుల‌ను ఆక‌ర్షిస్తోంది. త‌న చొక్కా పైగుండీలు తీసి ఆయ‌న ఎన్న‌డూ లేని విధంగా క‌న‌ప‌డుతూ బ‌ర్త్ డే పార్టీలో హంగామా చేశాడు.

కాగా, కార్తికేయ, లావ‌ణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘చావు కబురు చల్లగా’ సినిమా ఈ నెల‌ 19న విడుదల కానుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు.  
Go Back to Shorts
Allu Arjun
Tollywood

More Telugu News