KTR: టైమింగ్ అదిరింది కానీ... పశ్చిమ బెంగాల్ లో గాలి ఎటు వీస్తుందో చెప్పలేం: కేటీఆర్

KTR responds on Mamata Banarjee and West Bengal election situation
  • రణరంగాన్ని తలపిస్తున్న పశ్చిమ బెంగాల్
  • టీఎంసీ వర్సెస్ బీజేపీ
  • ఇటీవలే మమతా బెనర్జీ కాలికి గాయం
  • కాలికి కట్టుతోనే ప్రచార బరిలో దీదీ
  • స్పందించిన కేటీఆర్
దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనుండగా, అన్నింట్లోకి పశ్చిమ బెంగాల్ లో హోరాహోరీ నెలకొంది. ఇక్కడ అధికార తృణమూల్, బీజేపీ మధ్య రణరంగాన్ని తలపించేలా వాడీవేడి వాతావరణం కొనసాగుతోంది. ఇటీవల సీఎం మమతా బెనర్జీ కాలికి గాయం కాగా, వీల్ చెయిర్ లోనే ఆమె ప్రచారం చేస్తోంది. కాలికి కట్టుతోనే ఆమె ప్రచార బరిలో ఉరికి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థ మమతాపై ఆసక్తికర కార్టూన్ పంచుకుంది.

కాలికి కట్టుతో ఫుట్ బాల్ పై కాలుమోపిన దీదీ... "ఇక ఆడదామా" అంటూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నట్టు ఆ చిత్రంలో పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. సరైన సమయంలో ఈ కార్టూన్ వచ్చిందని పేర్కొన్నారు.  పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల గాలి ఎటువైపు వీస్తుందో చెప్పలేం అని వ్యాఖ్యానించారు. కానీ... ఎంతో క్యాచీగా ఉన్న ఖేలా హోబే స్లోగన్ కు తగినట్టుగా క్రియేటివిటీ, టైమింగ్ అదిరిపోయాయని పేర్కొన్నారు.
KTR
Mamata Banerjee
West Bengal
Assembly Elections
TMC
BJP

More Telugu News