టీమిండియాకు స్లో ఓవర్ రేట్ జరిమానా

Slow over rate fine for Team India
  • నిన్న భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టీ20
  • నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయిన భారత్
  • నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా విసిరిన వైనం
  • ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా స్లో ఓవర్ రేట్ జరిమానాకు గురైంది. నిన్న ఇంగ్లండ్ తో రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తిచేయలేకపోవడంతో టీమిండియాకు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ జరిమానా విధించారు. నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా విసిరినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. కెప్టెన్ కోహ్లీ జట్టు తరఫున తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండా, కేవలం జరిమానాతో సరిపెట్టారు.
Go Back to Shorts
Team India
Slow Over Rate
Fine
ICC

More Telugu News