Stock Market: మళ్లీ విజృంభిస్తున్న కరోనా... నష్టాలతో ఆరంభమైన భారత స్టాక్ మార్కెట్లు

 Stock markets starts with loses
  • 551 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 160 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్న నిఫ్టీ
  • కరోనా నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న మదుపర్లు
  • నష్టాల బాటలో పలు రంగాల షేర్లు
వారాంతపు సెలవులు ముగించుకుని తాజా సెషన్స్ ఆరంభించిన భారత స్టాక్ మార్కెట్లకు నిరాశ తప్పలేదు. ఆరంభంలోనే నష్టాలు పలకరించాయి. సెన్సెక్స్ 551 పాయింట్ల నష్టంతో 50,284 వద్ద కొనసాగుతుండగా... నిఫ్టీ సైతం అదేబాటలో 160 పాయింట్లు నష్టపోయి 15,048 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయంగానూ, దేశంలోనూ కరోనా మళ్లీ విజృంభిస్తున్న కారణంగా ఆంక్షలు విధిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడం, గతవారం అమెరికా సూచీలు ప్రతికూల ఫలితాలు చవిచూడడం, ఇటు ఆసియా సూచీలు మధ్యస్థంగా కొనసాగుతుండడం భారత మార్కెట్ల ఓపెనింగ్ సెషన్ ను ప్రభావితం చేశాయి.

కాగా, రియల్ ఎస్టేట్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు మాత్రం ఆశాజనకంగా ట్రేడవుతున్నాయి. మిగిలిన రంగాల షేర్లు నష్టాలబాటలో పయనిస్తున్నాయి.
Stock Market
Loss
Sensex
Nifty
Corona Virus
India
USA

More Telugu News