కమలహాసన్ కారు డోర్ తీసేందుకు యత్నించిన వ్యక్తి... చితకబాదిన ఎంఎన్ఎం కార్యకర్తలు

మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ గత రాత్రి కాంచీపురం జిల్లాలో ప్రయాణిస్తుంగా ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. జనసమూహంలో కమల్ కారు నిదానంగా వెళుతుండగా ఓ వ్యక్తి కారు డోర్ తీసేందుకు యత్నించాడు. ఇది గమనించిన ఎంఎన్ఎం కార్యకర్తలు ఆ వ్యక్తిని చితకబాదారు. కాంచీపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమలహాసన్ చెన్నైకి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి కమల్ పై దాడి చేసేందుకు యత్నిస్తున్నాడని భావించిన ఎంఎన్ఎం కార్యకర్తలు అతడ్ని చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. గాయాలపాలైన అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా, పోలీసుల విచారణలో అతను కమల్ అభిమాని అని తేలింది. ఎంఎన్ఎం వర్గాలు మాత్రం ఇది కమల్ పై దాడికి యత్నమేనంటున్నాయి. ఈ దాడి వెనకున్న ఉద్దేశమేంటో పార్టీ విచారణలో తేలుతుందని చెబుతున్నాయి.


More Telugu News