Pawan Kalyan: బెదిరింపులతోనే వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan alleges YCP leaders threatened voters in Municipal Elections
  • ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దూకుడు
  • అత్యధిక స్థానాల్లో విజయాలు
  • వైసీపీకి దరిదాపుల్లో లేని విపక్షాలు
  • పథకాలు అందకుండా చేస్తామని బెదిరించారన్న పవన్
  • ఓటర్ల కడుపుకొట్టి సాధించిన ఓట్లని విమర్శలు
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మరే పార్టీకి అవకాశం ఇవ్వని రీతిలో వైసీపీ దూసుకుపోవడంపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. బెదిరింపులు, దౌర్జన్యాలతోనే వైసీపీకి అత్యధిక స్థానాలు లభించాయని ఆరోపించారు. పథకాలు అందకుండా చేస్తామని వైసీపీ నేతలు బెదిరించింది నిజం కాదా అని పవన్ ప్రశ్నించారు.

రేషన్ కార్డులు నిలిపివేస్తామని, పెన్షన్లు రాకుండా చేస్తామని, విద్యా పథకాలు ఆపేస్తామని వైసీపీ నేతలు ప్రజలను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని పవన్ మండిపడ్డారు. ఇవి ప్రజల్లో నమ్మకం కలిగించి సాధించిన ఓట్లు కాదని, ఓటర్ల కడుపుపై కొట్టి తిండి లాక్కుంటామని బెదిరించి సంపాదించిన ఓట్లని విమర్శించారు.
Pawan Kalyan
YSRCP
Municipal Elections
Voters

More Telugu News