Pawan Kalyan: తెలంగాణ బీజేపీ నేత‌లపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగ్ర‌హం.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణీదేవికి మ‌ద్ద‌తు

pawan slams bjp telangana
  • బీజేపీ జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నాం
  • బీజేపీ తెలంగాణ శాఖ మాత్రం మ‌మ్మ‌ల్ని అవమానించింది
  • మా పార్టీని చుల‌కన చేసేలా ఆ పార్టీ నేత‌లు మాట్లాడారు
తెలంగాణ బీజేపీ నేత‌లు త‌మపై ప్ర‌ద‌ర్శిస్తోన్న తీరుప‌ట్ల జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మండిప‌డ్డారు. ఈ రోజు నిర్వ‌హించిన‌ జనసేన ఆవిర్భావ దినోత్సవ స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ... తాము బీజేపీ జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నామ‌ని గుర్తు చేశారు.

అయితే, బీజేపీ తెలంగాణ  రాష్ట్ర శాఖ మాత్రం తమను అవమానించిందని చెప్పారు. త‌మ పార్టీని చుల‌కన చేసేలా ఆ పార్టీ నేత‌లు మాట్లాడార‌ని వివ‌రించారు.  తమను పదే పదే అవమానిస్తున్నార‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో తాము తెలంగాణలో టీఆర్‌ఎస్
ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ ప్ర‌ధాని పీవీ న‌రసింహారావు కూతురు వాణిదేవికి మద్దతిస్తున్నామని చెప్పారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్య‌క్తి పీవీ అని చెప్పారు.


Pawan Kalyan
Telangana
Janasena
BJP

More Telugu News