Mallu Bhatti Vikramarka: పోలీస్ స్టేష‌న్ ఎదుట భట్టి ఆందోళ‌న‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

bhatti fires on police
  • ఖమ్మం నగరంలో ఘ‌ట‌న
  • కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నార‌న్న భ‌ట్టి
  • కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు- పోలీసుల మ‌ధ్య తోపులాట‌

త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అక్ర‌మంగా అరెస్టు చేశార‌ని ఖమ్మం నగరంలోని రెండ‌వ ప‌ట్ట‌ణ‌ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన‌ కాంగ్రెస్ కార్యకర్తలను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. దీంతో భట్టివిక్రమార్కకు పోలీసుల‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

త‌మ పార్టీ కార్యకర్తలను ఎందుకు వేధింపులకు గురిచేస్తున్నారని భట్టి విక్ర‌మార్క‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు స్టేష‌న్ ముందు ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మ‌ధ్య‌ తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగి కాంగ్రెస్‌ కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జ‌రుపుతున్నారు.

  • Loading...

More Telugu News