మరికాసేపట్లో మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. రెండు గంటల్లో తొలి ఫలితం

Municipal Election Vote Counting Starts at 8am
  • ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • 10 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం
  • లెక్కింపు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో మాత్రం ఓట్ల లెక్కింపు చేపట్టడం లేదు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 నగర పాలక సంస్థల్లోని 671 డివిజన్లలో 91 ఏకగ్రీవం కాగా 580 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఏలూరులో 47 డివిజన్లలో తప్ప మిగిలిన 533 డివిజన్లలో ఓట్లను లెక్కించనున్నారు.

అలాగే, రాష్ట్రంలో 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలోనూ మొత్తం 490 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమయ్యాయి.  ఓట్ల లెక్కింపు సందర్బంగా విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా, రెండు గంటల్లోనే తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Go Back to Shorts
Municipal Elections
Andhra Pradesh
Vote Counting

More Telugu News