చరణ్ సరసన మరోసారి బాలీవుడ్ భామ!

  • శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 
  • జులై నుంచి షూటింగ్ నిర్వహణ
  • కథానాయికగా కియారా అద్వానీ
  • చరణ్ తో కియారాకు రెండో సినిమా  
గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'వినయ విధేయ రామ' చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటించిన సంగతి మనకు తెలిసిందే. చరణ్ తో ఆమె జోడీ బాగుందంటూ అభిమానులు ప్రశంసలు కూడా కురిపించారు. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశం కనిపిస్తోంది.

దక్షిణాది అగ్రశ్రేణి దర్శకులలో ఒకరైన తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి విదితమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో కొరియన్ అందాల సుందరి సుజీబే కథానాయికగా నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఆమె స్థానంలో తాజాగా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం దర్శక నిర్మాతలు కియారా కోసం  ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట.

ఇక శంకర్, చరణ్ కలయికలో వచ్చే చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మించడానికి  సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. జులై నుంచి షూటింగును నిర్వహిస్తారని సమాచారం.

Kiara Advani
Ramcharan
Shankar
Dil Raju

More Telugu News