సమ్మె నోటీసు ఇచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి
- విశాఖ స్టీల్ ను ప్రైవేటుపరం చేస్తున్నట్టు స్పష్టం చేసిన కేంద్రం
- ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన ప్లాంటు ఉద్యోగులు
- 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని నోటీసులు
ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, పోస్కో కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసును విశాఖ స్టీల్ సీఎండీకి ఇచ్చారు. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సమ్మెకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్-కార్డు ఉన్న వారందరికీ శాశ్వత ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈనెల 17న అఖిలపక్ష సంఘాలతో నిరాహార దీక్ష, మార్చి 20న క్రష్ణా గ్రౌండ్స్ లో బహిరంగ సభకు కార్మిక సంఘాలు సిద్ధం అయ్యాయి.