Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Anushka sweats out in gym for her next film

  • వెయిట్ తగ్గించుకునే పనిలో అనుష్క
  • ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్ డేట్ 
  • మరో సినిమాలో 'మజిలీ' భామ    

*  'నిశ్శబ్దం' సినిమా తర్వాత ప్రముఖ నటి అనుష్క తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించింది. 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. అయితే, ఇటీవలి కాలంలో బాగా వెయిట్ పెరగడంతో ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తూ ఒళ్లు తగ్గించుకునే పనిలో అనుష్క ఉందట. ఆమె కాస్త వెయిట్ తగ్గిన తర్వాత ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని తెలుస్తోంది.
*  ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని పూర్తిచేస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మే నెల నుంచి మొదలవుతుందని సమాచారం.
*  ఆమధ్య నాగచైతన్య, సమంత జంటగా వచ్చిన 'మజిలీ' సినిమాలో బాలీవుడ్ భామ దివ్యాంష కౌశిక్ మరో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమాలో నటిస్తోంది. నాగశౌర్య హీరోగా రూపొందే 'పోలీసు వారి హెచ్చరిక' చిత్రంలో ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది.

Anushka Shetty
Junior NTR
Trivikram Srinivas
Nagashourya
  • Loading...

More Telugu News