Eluru: ఏలూరులో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు: హైకోర్టు గ్రీన్ సిగ్నల్

AP HC gives green signal to Eluru corporation elections
  • ఏలూరు కార్పొరేషన్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని పిటిషన్లు
  • ఎన్నికలు నిర్వహించొద్దన్న సింగిల్ బెంచ్
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డివిజన్ బెంచ్
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికలను నిర్వహించవద్దని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ ఈరోజు కొట్టేసింది. ఎన్నికలను నిర్వహించుకోవచ్చని, ఫలితాలను మాత్రం వెల్లడించొద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు మార్గం సుగమం అయింది.
Eluru
Corporation Election
High Court

More Telugu News