Anil Ravipudi: బాలయ్యతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాం.. ఇంకా కన్ఫర్మ్ కాలేదు: అనిల్ రావిపూడి

Anil Ravipudi on his future projects
  • గాలి సంపత్ మీడియా ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి
  • మహేశ్ బాబుతో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని వెల్లడి
  • రామ్ తోనూ ఓ చిత్రం ఉంటుందన్న అనిల్
  • స్పోర్ట్స్ నేపథ్యంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ తీస్తానని వివరణ
పటాస్ తో దర్శకత్వ ప్రస్థానం మొదలుపెట్టిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఎఫ్2 వంటి కామెడీలే కాదు, మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు వంటి భారీ సినిమాలు కూడా చేయగలడని అనిల్ నిరూపించుకున్నాడు.

తాజాగా అనిల్ దృష్టి అగ్రహీరో బాలకృష్ణపై పడింది. ఓ ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ... బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని భావిస్తున్నానని, అయితే ఇది ఇంకా ఫైనలైజ్ కాలేదని వెల్లడించారు. బాలయ్యతో చిత్రం చాలాసార్లు చర్చకు వచ్చిందని తెలిపారు. అది కార్యరూపం దాల్చాల్సి ఉందని పేర్కొన్నారు.

అంతేకాకుండా, మహేశ్ బాబుతో ఓ స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని అనిల్ వివరించారు. రామ్ తో ఓ సినిమా చేయాలన్నది కూడా తన ప్రణాళికల్లో ఉందని, స్పోర్ట్స్ సబ్జెక్టుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తానని వెల్లడించారు.

కాగా, బాలీవుడ్ ఎంట్రీపైనా స్పష్టత ఇచ్చారు. తన సినిమాల్లో ఏదైనా రీమేక్ చేయాలని భావిస్తే పటాస్ ను హృతిక్ రోషన్ తో తీస్తానని చెప్పారు. ప్రస్తుతం 'గాలి సంపత్' సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాలన్నీ మీడియాతో పంచుకున్నారు.
Anil Ravipudi
Balakrishna
Mahesh Babu
Ram
Tollywood

More Telugu News