Bhuma Akhila Priya: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ భర్త, అత్తమామలకు బెయిల్

Akhila Priya husband and in laws gets bail in kidnap case
  • సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు
  • తాజాగా ఆరుగురు నిందితులకు బెయిల్
  • భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్
  • బెయిల్ పొందిన కిరణ్మయి, నాయుడు
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీమంత్రి అఖిలప్రియ నిందితురాలు అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరికొందరు నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

అఖిలప్రియ భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజా విచారణలో మొత్తం ఆరుగురు నిందితులు బెయిల్ పొందారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్గవరామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడులకు కూడా బెయిల్ లభించింది. ఇతర నిందితులు సిద్ధార్థ, మల్లికార్జునరెడ్డి కూడా బెయిల్ పొందారు.

ఇటీవల మాజీ మంత్రి అఖిలప్రియ ఓ భూవివాదంలో ప్రవీణ్ రావు, నవీన్, సునీల్ ను కిడ్నాప్ చేసినట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయగా, ఇదివరకే బెయిల్ పై ఆమె విడుదలయ్యారు.
Bhuma Akhila Priya
Kidnap Case
Bhargavaram
Jagat Vikhyat Reddy
Bowenpally
Hyderabad

More Telugu News