Kalvakuntla Kavitha: కొండగట్టు క్షేత్రంలో రామకోటి స్తూపానికి భూమిపూజ చేసిన కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha laid foundation in Kondagattu shrine

  • ఇటీవల కవిత పుణ్యక్షేత్రాల సందర్శన
  • తాజాగా కొండగట్టు అంజన్న ఆలయానికి విచ్చేసిన వైనం
  • వేదమంత్రాల నడుమ భూమిపూజ కార్యక్రమం
  • హనుమాన్ చాలీసా పారాయణం పోస్టర్ విడుదల

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఆధ్యాత్మిక బాట పట్టారు. తరచుగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. తాజాగా, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయదలచిన రామకోటి స్తూపానికి కవిత భూమి పూజ చేశారు. అంతేకాకుండా అఖండ హనుమాన్ చాలీసా పారాయణం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వేదపండితులు పాల్గొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News