Hyderabad: హైద‌రాబాద్ పేరును మార్చేస్తాం: బీజేపీ నేత మురళీధర్ రావు

we will change hyderabad name
  • భాగ్యనగర్‌గా న‌గర పేరును మార్చుతాం 
  • ఈ విష‌యంలో మ‌మ్మ‌ల్ని ఎవరూ అడ్డుకోలేరు
  • సైద్ధాంతిక మార్పును కూడా తీసుకువ‌స్తాం
హైద‌రాబాద్ పేరును మార్చేస్తామ‌ని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు  వ్యాఖ్యానించారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చితీరతామని, ఈ విష‌యంలో త‌మ‌ను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. కేవలం న‌గ‌ర‌ పేరును మార్చ‌డం మాత్ర‌మే తమ ఉద్దేశం కాదని, స‌మాజంలో సైద్ధాంతిక మార్పును కూడా తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.

ఈ  అంశాల‌పై తాము ప్రజల నుంచి మద్దతును కూడగడతామని స్ప‌ష్టం చేశారు. దీనిపై ప్ర‌జ‌ల‌కు తాము అవగాహన కలిగిస్తామని చెప్పారు. భార‌త్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ప్రపంచానికే మ‌న దేశం ఆదర్శంగా నిలుస్తోందని ఆయ‌న తెలిపారు. కాగా, గ‌తంలోనూ కొంద‌రు బీజేపీ నేత‌లు హైద‌రాబాద్ పేరును భాగ్య‌న‌గ‌ర్‌గా మార్చుతామ‌ని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.
Hyderabad
muralidar rao
BJP

More Telugu News