ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా
- గుండెల్లో నొప్పిగా ఉందన్న గుత్తా
- సోమాజీగూడ యశోద ఆసుపత్రికి తరలింపు
- రెండు స్టెంట్స్ వేసిన వైద్యులు
- పరామర్శించిన పలువురు నేతలు
పరీక్షించిన వైద్యులు గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే నాళాలు రెండు చోట్ల మూసుకుపోయినట్టు గుర్తించారు. ఆ వెంటనే రెండు స్టెంట్లు వేశారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి గుత్తా ఆర్యోగంపై ఆరా తీశారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు నేతలు ఆసుపత్రికి వెళ్లి గుత్తాను పరామర్శించారు.