టీడీపీ నేత మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత
- మూడు రోజులుగా విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స
- బ్రెయిన్ డెడ్‌తో ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నారా లోకేశ్, రోహిత్
టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాంజీ, పార్టీ వ్యవహరాల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. రాంజీ మృతి విషయం తెలిసి టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. సినీ నటుడు నారా రోహిత్, మాజీ మంత్రి నారా లోకేశ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.