ఆదాయం పడిపోయింది.. ఖర్చులు పెరిగాయి.. అందుకే అప్పులు: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన
- కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయింది
- సంక్షేమ పథకాలకు ఎక్కువ మొత్తం అవసరమవుతోంది
- నేను ఇప్పటికీ పాత కారునే వాడుతున్నా
డబ్బు అవసరం ఉన్నందుకే అప్పులు చేశామనే విషయాన్ని గర్వంగా చెప్పగలనని బుగ్గన అన్నారు. తమది సంక్షేమ ప్రభుత్వమని... అందుకే ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమవుతోందని చెప్పారు. ఈ పథకాల ద్వారా అదే డబ్బును వ్యవస్థలోకి పంపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్ర అర్థిక స్థితి మెరుగుపడుతోందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల వల్ల విమర్శించేందుకు ఏమీ లేక అప్పులు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తనపై తప్పుడు ప్రచారం చేశారని బుగ్గన మండిపడ్డారు. గత వంద ఏళ్లుగా తమ కుటుంబం మైనింగ్ రంగంలో ఉందని చెప్పారు. తాను ఇప్పటికీ అపార్టుమెంటులోనే ఉంటున్నానని... పాత కారునే వాడుతున్నానని తెలిపారు. చంద్రబాబు చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.