శ్రీశైలంలో 25 మంది అనంతపురం భక్తులకు అస్వస్థత
- దర్శనానికి అనంతపురం జిల్లా నుంచి 120 మంది భక్తులు
- వెంట తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకున్న వైనం
- ఆ తర్వాత కాసేపటికే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి
ఆ తర్వాత కాసేపటికే వారిలో కొందరు తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో బాధపడ్డారు. బాధితులు 25 మందిని వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆహారం విషపూరితం కావడం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.