రాసలీలల ఆరోపణల నేపథ్యంలో.. కర్ణాటక మంత్రి రాజీనామా
- జల వనరుల మంత్రి రమేశ్ జర్కిహోళిపై తీవ్ర ఆరోపణలు
- ఉద్యోగం పేరిట లైంగికంగా వాడుకున్నారంటూ ఓ మహిళ వ్యాఖ్యలు
- కలకలం రేపిన వీడియో ఆధారాలు
- సీఎంకు రాజీనామా లేఖ పంపిన రమేశ్ జర్కిహోళి
అయితే తన చిత్రాలను మార్ఫింగ్ చేసి ఈ వీడియో రూపొందించారని నిన్న వ్యాఖ్యానించిన మంత్రి రమేశ్ జర్కిహోళి... తప్పనిసరి పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు సీఎం యడియూరప్పకు రాజీనామా లేఖను పంపించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, వాటిపై దర్యాప్తు చేయాలని రమేశ్ కోరారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఆరోపణలు వచ్చాయి కాబట్టి నైతిక బాధ్యతతో రాజీనామా చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు.