Hackers: తెలంగాణ ట్రాన్స్ కో విభాగం సర్వర్లలో ప్రవేశించేందుకు చైనా హ్యాకర్ల యత్నాలు

China Hackers tries to enter Telangana electricity computer systems
షార్ట్స్‌లో చూడండి
చైనా హ్యాకర్లు ఇటీవల తమ కార్యకలాపాలను విస్తృతం చేశారు. తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ సర్వర్లపై చైనా హ్యాకర్లు దాడులకు యత్నిస్తున్న విషయం వెల్లడైంది. తెలంగాణ విద్యుత్ శాఖకు ఈ మేరకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్లను చేరుకోవడానికి చైనా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అప్రమత్తం చేసింది. హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ శాఖ తమ కంప్యూటర్ వ్యవస్థల ఐడీలు, పాస్ వర్డ్ లను మార్చేసినట్టు తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ వెల్లడించారు.
Go Back to Shorts
Hackers
Telangana Electricity Department
China
CERT

More Telugu News