జగన్ పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోంది... ఇది మరో దారుణ ఘటన: నారా లోకేశ్
- విజయనగరం జిల్లాలో డిగ్రీ విద్యార్థినిపై దాడి
- కాళ్లు చేతులు కట్టేసి తుప్పల్లో పడేశారన్న లోకేశ్
- జగన్ బుల్లెట్ లేని గన్ అంటూ వ్యాఖ్యలు
- అందుకే మృగాళ్లు రెచ్చిపోతున్నారని వెల్లడి
- నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఈ సందర్భంగా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ బుల్లెట్ లేని గన్ అని తెలిసి మృగాళ్లు రెచ్చిపోతున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుందని పేర్కొన్నారు.
లేని దిశ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని లోకేశ్ వ్యాఖ్యానించారు.