Amit Shah: తిరుపతి పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Union Home Minister Amit Shah cancels Tirupati visit
  • తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం
  • ఈ నెల 4,5 తేదీల్లో సమావేశం
  • తిరుపతి రాబోవడంలేదన్న అమిత్ షా
  • దేశంలో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు
మార్చి 4, 5 తేదీల్లో తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావించినా, తాజాగా ఆయన పర్యటన రద్దయింది. తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు అమిత్ షా వెల్లడించారు. అయితే, ఆయన పర్యటన ఎందుకు రద్దయిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు. తిరుపతిలో జరిగే సమావేశానికి ఏపీతో పాటు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు, లక్షద్వీప్ నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు.

కాగా, దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో ప్రచారం సాగించేందుకు వీలుగా అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా, 8 విడతల్లో పోలింగ్ జరుపుకోనున్న పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దాంతో, అమిత్ షా అధిక సమయం పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఈ పర్యటనకు రాబోవడంలేదని తెలుస్తోంది.
Amit Shah
Tirupati Tour
Southeren States Development Council
Assembly Elections
West Bengal
BJP
India

More Telugu News