Vijayashanti: బండి సంజయ్ కి లోక్ సభ స్పీకర్ నుంచి అనుమతి వస్తే కేసీఆర్ మోసం బట్టబయలవుతుంది: విజయశాంతి

BJP leader Vijayasanthi says KCR fraud will reveal by Bandi Sanjay soon
  • కేసీఆర్ పార్లమెంటును తప్పుదారి పట్టించారంటూ బండి వ్యాఖ్యలు
  • స్పందించిన విజయశాంతి
  • కేసీఆర్ పాల్పడిన మరో మోసం బయటపడుతుంది  
  • ప్రజలకు మరింత స్పష్టత వస్తుందని వివరణ
సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి లోక్ సభ స్పీకర్ అనుమతి ఇస్తే ఈ అసత్యాల సీఎం మోసాల్లో మరో మోసం బయటపడుతుందని తెలిపారు. తద్వారా ప్రజలకు మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ పార్లమెంటును తప్పుదారి పట్టించి భారీ మోసం చేశారని ఇటీవల బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. స్పీకర్ అనుమతిస్తే కేసీఆర్ మోసాన్ని బట్టబయలు చేస్తామని అన్నారు.

ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలోనూ విజయశాంతి స్పందించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని సీఎం కేసీఆర్ పర్సెంటేజీ లెక్కలతో సహా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. అసలు టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్థి కబ్జాకోరో, దోపిడీదారో తెలిసిన తర్వాత ప్రజలు ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు.

అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపైనా సీఎం ఊహాగానాలకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ చేసేవన్నీ పిచ్చి సర్వేలని తాను గతంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే చెప్పానని, తాను చెప్పిందే జరిగిందని విజయశాంతి వెల్లడించారు.
Vijayashanti
KCR
Bandi Sanjay
Lok Sabha
Telangana

More Telugu News