Anasuya: అనసూయ ఐటం సాంగ్ 'పైన పటారం...' ప్రోమో విడుదల

Anasuya item song promo released
  • కార్తికేయ, లావణ్య త్రిపాఠీ జంటగా 'చావు కబురు చల్లగా'
  • 'చావు కబురు చల్లగా' చిత్రంలో అనసూయ ఐటం సాంగ్
  • 'పైన పటారం' అంటూ సాగే గీతంలో హుషారుగా నర్తించిన అనసూయ
  • ప్రోమో వీడియోలో అలరిస్తున్న అనసూయ డ్యాన్సులు
'చావు కబురు చల్లగా' చిత్రంలో యాంకర్ బ్యూటీ అనసూయ ఓ ఐటం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. "పైన పటారం... లోన లొటారం" అంటూ సాగే ఆ గీతం తాలూకు ప్రోమో వీడియోను చిత్రం బృందం ఈ సాయంత్రం విడుదల చేసింది. పక్కా మాస్ తరహాలో ఉన్న ఈ పాటలో అనసూయ కుర్రకారును గిలిగింతలు పెట్టే విధంగా కనిపిస్తోంది. ప్రోమోలోనే ఇలావుంటే ఇక పూర్తి వీడియోలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో వస్తున్న 'చావు కబురు చల్లగా' చిత్రంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లు. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అప్ డేట్లకు సినీ అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. తాజాగా అనసూయ ఐటం సాంగ్ ప్రోమో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.
Anasuya
Item Song
Paina Pataram
Chaavu Kaburu Challagaa

More Telugu News