మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి: ప్రశాంత్ కిశోర్
- దేశ వ్యాప్తంగా వేడి పుట్టిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
- బెంగాల్ లో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ
- మమతకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్
మరోవైపు మమత పార్టీ గెలుపుపై ప్రశాంత్ కిశోర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కీలక యుద్ధాల్లో ఒకటి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో జరుగుతోందని అన్నారు. 'బెంగాల్ తన సొంత కూతురునే కోరుకుంటోంది' అనే సందేశంతో రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మే 2వ తేదీన తన చివరి ట్వీట్ చూసేందుకు సిద్ధంగా ఉండండి అని ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్న సంగతి తెలిసిందే.