సజ్జల నన్ను విమర్శించేంతటివాడా... ఏనాడైనా ఎన్నికల్లో నిలిచి గెలిచాడా?: చంద్రబాబు ఫైర్
- కుప్పం కోట బద్దలైందన్న సజ్జల
- విమర్శలు చేసేందుకు సజ్జలకున్న అర్హత ఏంటన్న చంద్రబాబు
- తాను ఇప్పటివరకు మాట తూలలేదని స్పష్టీకరణ
- తనకు ప్రజాబలం ఉందని ధీమా
కుప్పం నియోజకవర్గంలోని రాజ్ పేట్ లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అస్తవ్యస్తంగా మారుతోందని, రాష్ట్రాన్ని స్వాహా చేయాలని కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. జగన్ ఒక డ్రామారాయుడు అని, సీఎం జగన్ కు సెంటిమెంట్ అంటే తెలియదని విమర్శించారు. విశాఖ ఉక్కును కూడా కోల్పోతున్నామని అన్నారు.