ప్రముఖ రచయిత వేల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- నారాయణరావు సాహితీ సేవలకు గుర్తింపుగా అవార్డు
- పరిశోధకుడిగా, అనువాదకుడిగా గుర్తింపు
- సుప్రసిద్ధ కావ్యాలను ఆంగ్లంలోకి అనువాదం
- సుదీర్ఘకాలం అమెరికాలో తెలుగు ఆచార్యుడిగా సేవలు
శ్రీకాళహస్తీశ్వర శతకం, బసవపురాణం, క్రీడాభిరామం, కళాపూర్ణోదయం, కాళిదాసు విక్రమోర్వశీయం వంటి రచనలను, అన్నమయ్య, క్షేత్రయ్య వంటి వాగ్గేయకారుల సాహిత్యాన్ని ఆయన అనువదించారు. ప్రసిద్ధ తెలుగు కావ్యాలను ఆయన ఆంగ్లంలోకి తర్జుమా చేశారు.