Uttar Pradesh: యూపీలో మరో దిగ్భ్రాంతికర ఘటన.. కాలినగాయాలతో రోడ్డుపక్కన నగ్నంగా పడి ఉన్న కాలేజీ విద్యార్థిని

Missing college student found with 60 percent burn injuries in UP
  • యూపీలో వరుస ఘటనలు
  • కాలేజీకి వెళ్లి అదృశ్యమైన యువతి
  • మాజీ మంత్రి స్వామి చిన్మయానంద కాలేజీలో చదువుతున్న విద్యార్థిని
  • స్పృహ వచ్చాక కానీ అసలు విషయం తెలియదన్న పోలీసులు
  • మరో ఘటనలో నలుగురు విద్యార్థినుల అదృశ్యం
నిత్య నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. కేంద్రమాజీ మంత్రి స్వామి చిన్మయానంద ఆధ్వర్యంలోని సుఖ్‌దేవానంద్ కాలేజీలో బీఏ రెండో ఏడాది చదువుతున్న యువతి 60 శాతం కాలిన గాయాలతో, రోడ్డు పక్కన నగ్నంగా పడి ఉండడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో ఏం జరిగిందన్న విషయం ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సోమవారం తండ్రితో కలిసి కాలేజీకి వచ్చిన యువతి కళాశాల ముగిసినా బయటకు రాకపోవడంతో తండ్రి ఆందోళన చెందాడు. ఆమె కోసం వెతుకుతున్న సమయంలో లక్నో-బరేలీ జాతీయ రహదారి పక్కన పడి ఉన్నట్టు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు 60 శాతం కాలిన గాయాలతో, నగ్నంగా పడి ఉన్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

షాజహాన్‌పూర్‌లోనే జరిగిన మరో ఘటనలో చెరువు వద్దకు వెళ్లిన ఐదేళ్ల బాలిక, ఆమెకు సోదరి వరుసయ్యే ఏడేళ్ల బాలిక అదృశ్యమయ్యారు. వారి కోసం వెతుకుతున్న సమయంలో ఐదేళ్ల బాలిక సమీపంలోని పొలంలో విగతజీవిగా కనిపించింది. మరో బాలిక తీవ్రంగా గాయపడి ఉంది. మరో ఘటనలో రాష్ట్రంలోని లిఖింపూర్‌లో సోమ, మంగళవారాల్లో నలుగురు కాలేజీ విద్యార్థినులు అదృశ్యమయ్యారు.
Uttar Pradesh
Crime News
Student
Missing

More Telugu News