Tiger woods: టైగర్ ఉడ్స్ ప్రయాణిస్తున్న కారు బోల్తా.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న గోల్ఫ్ సూపర్ స్టార్

US Golfer Tiger Woods In Surgery After Roll Over Car Crash
  • లాస్ఏంజెలెస్‌లో ఘటన
  • ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ప్రమాదం
  • తీవ్ర గాయాలైన కాళ్లకు సర్జరీ
గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ ఉడ్స్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంగళవారం ఉదయం లాస్ ఏంజెలెస్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే, వెంటనే బెలూన్లు తెరుచుకోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, పారామెడికల్ సిబ్బంది కారులో చిక్కుకున్న ఆయనను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు ఓ పక్క పూర్తిగా ధ్వంసమైంది. టైగర్ ఉడ్స్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడికి సర్జరీ చేసినట్టు తెలుస్తోంది.
Tiger woods
Golf Star
Road Accident

More Telugu News