గులాబీ బాల్ తో సవాలే.. తొలి గంటన్నర ఛాలెంజింగ్ గా ఉంటుంది: కోహ్లీ
- లైట్ల వెలుతురులో తొలి గంటన్నర ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి
- ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళం మనకు ఉంది
- చివరి రెండు టెస్టులు గెలిచేందుకే ప్రయత్నిస్తాం
పేస్ కు అనుకూలించే వాళ్ల సొంత మైదానాల్లోనే వారిని చిత్తు చేశామని తెలిపాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళం ఇండియాకు ఉందని తెలిపాడు. పింక్ బాల్ తో ఆడటం సవాల్ తో కూడుకున్నదని అన్నాడు. లైట్ల వెలుతురులో తొలి గంటన్నర ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెప్పాడు. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని అన్నాడు.
మరో విజయాన్ని అందుకుంటే స్వదేశంలో అత్యధిక విజయాలను సాధించిన కెప్టెన్ గా ధోనీ రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు. ఈ రికార్డుపై కోహ్లీ మాట్లాడుతూ, అలాంటి విషయాలను తాము పట్టించుకోమని చెప్పాడు. రికార్డులు అస్థిరమైనవని అన్నాడు. మాజీ కెప్టెన్ పై తమకు ఎంతో ప్రేమ, గౌరవం ఉంటాయని చెప్పాడు. చివరి రెండు టెస్టులు గెలవాలనే తాము ఆడతామని అన్నాడు.