"అంగి సుట్టు మడతేసి.." అంటూ నాని హీరోయిజం... 'టక్ జగదీష్' నుంచి టీజర్ విడుదల
- నాని హీరోగా టక్ జగదీష్ చిత్రం
- శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా
- రేపు నాని పుట్టినరోజు
- ఒకరోజు ముందుగా టీజర్ రిలీజ్
- ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన
టీజర్ చూస్తుంటే పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వచ్చే కుటుంబ కథా చిత్రమని, అటు కమర్షియల్ విలువలకు లోటు ఉండదని అర్థమవుతోంది. ఈ టీజర్ కు అభిమానుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.