Sachin Tendulkar: బ్యాగ్రౌండ్​ తో పనిలేదు.. క్రీడలు గుర్తించేది సత్తానే: సచిన్​

Sport doesnt recognise anything other than on field show says Sachin Tendulkar
  • ప్రతి ఆటగాడూ సమానమేనన్న క్రికెట్ దిగ్గజం
  • అన్అకాడమీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం
  • విద్యార్థులతో ఆన్ లైన్ లో మమేకమైన మాస్టర్ బ్లాస్టర్
ఓ ఆటగాడి బ్యాగ్రౌండ్ తో క్రీడలకు పని లేదని, ఫీల్డ్ లో అతడి సత్తాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘‘డ్రెస్సింగ్ రూంలోకి అడుగు పెట్టే ప్రతిసారీ.. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?  నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడివి? నీ బ్యాగ్రౌండ్ ఏంటి? అన్నది అసంబద్ధం. ప్రతి ఒక్క ఆటగాడూ అక్కడ సమానమే’’ అని అన్నాడు. అన్అకడామీ అనే ఈలెర్నింగ్ పోర్టల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తర్వాత వర్చువల్ గా మీడియాతో మాట్లాడాడు. విద్యార్థులతోనూ మమేకమయ్యాడు.

కొత్త కొత్త మార్గాల ద్వారా అందరినీ క్రీడలు ఏకం చేస్తున్నాయన్నాడు. టీం కోసం ఓ వ్యక్తిగా ఏం చేయాలో అది చేయాలని విద్యార్థులకు సూచించాడు. తన విద్యాభ్యాసం మొత్తంలో ఎన్నెన్నో స్కూళ్లు మారానని, వేర్వేరు కోచ్ లను కలిశానని చెప్పుకొచ్చాడు. వారి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు.

కలలను నిజం చేసుకోవడానికి ఎప్పుడూ శ్రమిస్తూనే ఉండాలంటూ విద్యార్థులకు సచిన్ సూచించాడు. మనల్ని మనం ఎంత ముందుకు తీసుకెళ్తే.. అన్ని విజయాలు సాధిస్తామన్నాడు. ఏదైనా సాధించలేకపోతే అక్కడితోనే అయిపోయిందన్న నిరాశ వద్దని, మరో అడుగు ముందుకేసి అనుకున్నది సాధించాలని స్ఫూర్తి నింపాడు.
Sachin Tendulkar
Cricket
Unacademy

More Telugu News