Nimmagadda Ramesh: గవర్నర్ తో భేటీ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

SEC Nimmagadda Ramesh meets Governor
  • పంచాయతీ ఎన్నికల తీరును వివరించిన వైనం
  • ఫలితాలు, ఏకగ్రీవాలకు సంబంధించిన నివేదిక అందించిన ఎస్ఈసీ
  • మున్సిపల్ ఎన్నికల నిర్వహణ గురించి చర్చ 
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లి భేటీ అయ్యారు. నిన్నటితో పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన తీరును గవర్నర్ కు ఎస్ఈసీ వివరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు.

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ గురించి కూడా గవర్నర్ కు వివరించారు. నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల వివరాలు, ఏకగ్రీవాలు తదితర సమాచారంతో కూడిన నివేదికను గవర్నర్ కు సమర్పించినట్టు తెలుస్తోంది. దాదాపు అరగంట సేపు వీరి భేటీ కొనసాగింది.
Nimmagadda Ramesh
SEC
Andhra Pradesh
Governor

More Telugu News