Chiranjeevi: ఉవ్వెత్తున ఎగసిన ఈ ఉప్పెన విజయం మీ ధైర్యానికి, అభిరుచికి నిదర్శనం: నిర్మాతలకు చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi appreciates Uppena movie producers
  • వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా ఉప్పెన చిత్రం
  • ఇటీవల విడుదలై విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం
  • మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిలకు చిరు అభినందనలు
  • ప్రత్యేక సందేశంలో పొగడ్తల జల్లు కురిపించిన మెగాస్టార్
వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన చిత్రం హిట్ టాక్ పొందింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడి విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉవ్వెత్తున ఎగసిన ఈ ఉప్పెన విజయం మీ ధైర్యానికి, అభిరుచికి నిదర్శనం అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిలను అభినందించారు. చిరు చినుకు నుంచి ఉప్పెనగా మారేంతవరకు ఆ సినిమాకి వెన్నంటే నిలిచిన వాయువు మీరు అంటూ కొనియాడారు. ఈ విజయంవైపు ప్రయాణం తమదే అయినా, ఆ ప్రయాణం వెనుక ధైర్యం మీరు అంటూ ప్రశంసించారు.

కథగా విన్నప్పటి నుంచి సినిమాగా మారేంత వరకు మా ప్రతి అడుగుకి మార్గదర్శి మీరు అంటూ చిరంజీవి కితాబునిచ్చారు. ఎన్నో అడ్డంకులు వచ్చినా, మీరు ఇచ్చిన ధైర్యానికి సర్వదా కృతజ్ఞులం అని చిరంజీవి పేర్కొన్నారు. 'ఇలాంటి మంచి సినిమాను  ప్రేక్షకులు వెండితెర మీద చూడాలన్న మీ తపన మమ్మల్ని నడిపించింది' అంటూ తన సందేశంలో పేర్కొన్నారు.
Chiranjeevi
Ravi
Navin
Uppena
Mythri Movie Makers
Tollywood

More Telugu News